
ట్యాగ్ · 2 కథనాలు


బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!

దుల్కర్ సల్మాన్ తో హను రాఘవపూడి చిత్రం?
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్కర్ సల్మాన్. కేవలం మాతృభాషకే పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశాడు. తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ `మహానటి`లో జెమినీ గణేషన్ గా నటించి అలరించాడు. ఆపై మళ్ళీ తెలుగులో నేరుగా నటించని దుల్కర్ త్వరలో మరోమారు టాలీవుడ్ బాట పట్టనున్నాడట.

బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!
టాలీవుడ్ డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హను రాఘవపూడి. 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా పోయినా కూడా సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ పొందాడు. ఇక తెలుగులో ఈ డైరెక్టర్ సినిమాలు రావడం కష్టమే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్…