
ట్యాగ్ · 2 కథనాలు

'అరణ్య' టీజర్ రిలీజ్

రానా 'హథీ మేరే సాథి' రిలీజ్ వాయిదా
గత ఏడాది కరోనా ప్రభావం ఏ రేంజ్ లో ఉందో చూశాం. ఇక సినీ పరిశ్రమ కూడా ఎంత నష్టపోయిందో చూశాం. ఇటీవలే కాస్త పరిస్థితులు మెరుగుపడటంతో మళ్ళీ సినిమాల షూటింగ్ లు, రిలీజ్ లు, ప్రెస్ మీట్లతో బిజీ అయింది చిత్ర పరిశ్రమ. అయితే మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తలనొప్పి మొదలైంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. గత కొన్ని రోజులుగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ ఇస్తున్నా.. మరోవైపు కేసులు పెరగడం ఇప్పుడు అందరిలో ఆందోళనను కలిగిస్తోంది. ఈనేపథ్యంలోనే ఇక్కడ కూడా థియేటర్స్ మూసేస్తారేమో అన్న వార్తలు మొదలయ్యాయి.
'అరణ్య' టీజర్ రిలీజ్
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.