ట్యాగ్ · 2 కథనాలు

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
'గుడ్ లక్ సఖి' షూటింగ్ పూర్తి
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. ఇటీవలే పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ప్రస్తుతం మూడునాలుగు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. వాటిలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న గుడ్ లక్ సఖి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగలగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ గ్రహీత "మహానటి "కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక పల్లెటూరి యువతి జాతీయ స్థాయిలో షూటర్ గా మారిన నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది .