
ట్యాగ్ · 2 కథనాలు


'మేజర్' టీజర్ రిలీజ్ డేట్ వాయిదా

'మేజర్' శోభిత ఫస్ట్ లుక్ రిలీజ్
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మేజర్. ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికే అడివి శేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ లుక్ అచ్చం ఉన్ని కృష్ణన్ లాగే ఉండటంతో బాగా ఆకట్టుకుంది.

'మేజర్' టీజర్ రిలీజ్ డేట్ వాయిదా
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇదిలాఉండగా ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను మార్చి 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ ఆవిషయాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపింది.