
ట్యాగ్ · 2 కథనాలు


గాండీవధారి అర్జున యూకే భారీ షెడ్యూల్ పూర్తి
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకోవడానికే ప్రయత్నిస్తుండేవాడు. ఒకే తరహా జోనర్‌కు పరిమితం కాకుండా ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తున్నాడు. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. ఇటీవలే వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గాండీవ ధారి అర్జున
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ పీఎస్‌వీ గరుడవేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ VT 12 మూవీ లండన్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏజెంట్ మూవీ ఫేమ్ సాక్షి వైద్య కథానాయిక కాగా వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సినిమా లండన్ షెడ్యూల్‌లో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారనీ, మిగతా 20 శాతం కూడా యూరోప్ దేశాల్లో చిత్రీకరణకు ప్లాన్ చేశారనీ సమాచారం. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.