
ట్యాగ్ · 2 కథనాలు


పాన్ ఇండియా హీరోగా గాలిజనార్థన్ తనయుడు
కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. రాధా కృష్ణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా కూడా వెళ్లారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈసినిమా. అంతేకాదు దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్టు తెలుస్తుంది.

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు 'కిరీటి' ఎంట్రీ.. ముఖ్య అతిథిగా రాజమౌళి..!
రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు…