
ట్యాగ్ · 2 కథనాలు


ఆగష్ట్ 15 కు రానున్న ఎన్టీఆర్

పవన్ కళ్యాణ్ అన్న లెక్క -రామ్ చరణ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ , తారాగణం తో తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో రామ్ చరణ్ అతిధిగా పాల్గొన్నారు. "ఆర్‌ఆర్‌ఆర్" మూవీ లో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పి రామ్ చరణ్ సినిమా పట్ల క్రేజ్‌ను రెట్టింపు చేశారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యపరిచే అంశాలున్నాయనీ , స్క్రీన్ పై తారక్‌ని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందేననీ చెప్పారు. కొమురం భీమ్ పాత్రలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందనీ, ఆ సినిమా షూట్‌లో మనం…

ఆగష్ట్ 15 కు రానున్న ఎన్టీఆర్
జెమిని టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కాబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. గతంలో అక్కినేని నాగార్జున, చిరంజీవి నడిపించిన ఈ షోకు హోస్ట్ గా చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఇక కరోనా వల్ల ఈ ప్రోగ్రామ్ షూటింగ్ కు బ్రేక్ పడగా.. రీసెంట్ గానే షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ఇక షూటింగ్ అలా మొదలైందో లేదో అప్పుడే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ షో ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవం సంధర్భంగా మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారని అంటున్నారు.