
ట్యాగ్ · 2 కథనాలు

అన్నకు అతిథిగా తమ్ముడు..!

"ఎంత మంచివాడవురా !" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి
శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ " ఎంత మంచివాడవురా !" మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుంది. మెహరీన్ కథానాయిక. శరత్ బాబు, విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
అన్నకు అతిథిగా తమ్ముడు..!
‘118’ ఘనవిజయం తర్వాత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఈ నేపథ్యంలో జనవరి 5వ తేదీనగానీ .. 6వ తేదీనగాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కళ్యాణ్ రామ్ సినిమాల ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటాడు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.