ట్యాగ్ · 2 కథనాలు
చిరంజీవి చిత్రంలో తెలుగమ్మాయి?
హాలీవుడ్ నుండి ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు..!
అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు భామ ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా తెరపై పద్దతిగా కనిపిస్తుండటంతో అవేవీ అంతగా కలసిరావడం లేదు. ''అమీతుమీ, అ!, అరవింద సమేత'' లాంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో కూడా లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కియారా అద్వాని చేసిన పాత్రలో ఈషా రెబ్బా నటిస్తుంది.
చిరంజీవి చిత్రంలో తెలుగమ్మాయి?
`అంతకుముందు ఆ తరువాత` (2013)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఈషా రెబ్బా. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి... ఆపై పలు చిత్రాల్లో తన అభినయంతో కనువిందు చేసింది. కాగా... గత ఏడాది యంగ్ టైగర్ యన్టీఆర్ `అరవింద సమేత వీర రాఘవ`లో పూజా హెగ్డే చెల్లెలి పాత్రలో మెరిసిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి.... తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కిందని సమాచారం.