ట్యాగ్ · 2 కథనాలు
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న చైనీస్ `దృశ్యం`
థ్రిల్లర్ మూవీ "దృశ్యం "
సురేష్ ప్రొడక్షన్స్ , రాజ్ కుమార్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెలుగు , తమిళ , మలయాళ సక్సెస్ ఫుల్ చిత్ర సీనియర్ హీరోయిన్ శ్రీప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా రూపొందిన థ్రిల్లర్ "దృశ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. మలయాళ చిత్రపరిశ్రమ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ "దృశ్యం " మూవీ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో నదియా , నరేష్ , పరుచూరి వెంకటేశ్వర రావు , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. శరత్ సంగీతం అందించారు.
వసూళ్ళ వర్షం కురిపిస్తున్న చైనీస్ `దృశ్యం`
భారతీయ తెరపై పలు విదేశీ కథలు సంచలనం సృష్టించాయి. అయితే, ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ అవడం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రయత్నమే... `షీప్ వితౌట్ ఎ షెఫర్డ్`. మలయాళ చిత్రం `దృశ్యం`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా... గత ఏడాది డిసెంబర్ 13న విడుదలై... చైనాలో 2019 టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్ లో స్థానం దక్కించుకుంది. ఇప్పటికీ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొత్తమ్మీద... ఒక భారతీయ చిత్రం విదేశీ భాషలో రీమేక్ కావడమే కాకుండా కమర్షియల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేయడం రేర్ రికార్డ్ గానే చెప్పుకోవచ్చు.