ట్యాగ్ · 2 కథనాలు
కొరటాల, సుకుమార్ రూట్ లోకి హరీష్ శంకర్..!
సినీ ఇండస్ట్రీలో కాలిక్యులేషన్స్ మారిపోతున్నాయి. ఈ మధ్య హీరోలు కూడా తమ సొంత కుంపటిని ఏర్పాటుచేసుకుని సొంతగా సినిమాలు తీసేసుకుంటున్నారు. మరి మేము మాత్రం సినిమాలే ఎందుకు డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారేమో డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్నారు. వాళ్ళ సినిమాలు వాళ్లే నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే మన డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల శివ కూడా నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు రెడీ అయినట్టు గతంలోనే…
పవన్ సినిమాపై హరీష్ - తమ్ముడూ స్క్రిప్ట్, మ్యూజిక్ పనులు జరుగుతున్నాయి
ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అభిమాని తన ట్విట్టర్ ద్వారా ఎన్ని సినిమాలు అయినా చేయన్నా.. కానీ తదుపరి సినిమా పవర్ స్టార్ తో చేయి అంటూ ఓ అభిమాని చేసిన విన్నపానికి హరీశ్ స్పందించాడు. 'తమ్ముడూ... పవర్ స్టార్ మూవీ స్క్రిప్ట్ వర్క్, మ్యూజిక్ వర్క్ కొనసాగుతున్నాయి. పవన్ కల్యాణ్ చిత్రం తర్వాతే మరే కమిట్ మెంట్ అయినా. నేను కూడా మీలాంటి అభిమానే అని మర్చిపోకు' అని సమాధానం ఇచ్చాడు. ఇక సినిమాకు సంబంధిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.