
ట్యాగ్ · 2 కథనాలు


నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "

20 ఏళ్ల సక్సెఫుల్ జర్నీ
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. నిజానికి దిల్ రాజు అసలు రేపు వెంకట రమణా రెడ్డి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు 2003లో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీని తొలిసారిగా నిర్మించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమాతోనే తన బ్యానర్ పై మంచి సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆసినిమానే తన ఇంటి పేరుగా మార్చుకొని దిల్ రాజు అయ్యాడు. ఇక అక్కడి నుండి నిర్మాతగా తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దిల్ తర్వాత ఆయన వచ్చిన…

నితిన్ యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వి వి వినాయక్ దర్శకత్వంలో నితిన్ , నేహ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "దిల్ " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సూపర్ హిట్ "జయం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నితిన్ తన రెండవ మూవీ "దిల్" లో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి హీరో గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కమెడియన్ వేణు మాధవ్ తన మిమిక్రీ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ పి పట్నాయక్ సంగీతం అందించారు.