ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2
రజినీకాంత్ పాత్రలో ధనుష్... మేనక పాత్రలో కీర్తి సురేష్?
ఆ మధ్య `తొడరి`(తెలుగులో `రైల్`) చిత్రంలో జంటగా నటించిన కోలీవుడ్ స్టార్ ధనుష్, కేరళ కుట్టి కీర్తి సురేష్.. మరోసారి జట్టుకట్టనున్నారట. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సారి వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా 80`ల నాటి ఓ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ అట. ఆ చిత్రమే `నెట్రిక్కన్` (1981).
‘కర్ణన్’ గా ‘ధనుష్’
ఇటీవల తూటా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ మళ్ళీ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో `పట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 16న రిలీజ్ కానుంది.
మెగాస్టార్ టైటిల్ తో ధనుష్ చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి పాత టైటిల్స్... కొత్త చిత్రాలకు చిరునామాగా నిలవడం ఇప్పుడు ఓ ట్రెండ్ గా మారింది. నిరుడు `ప్రాణం ఖరీదు, రాక్షసుడు, గ్యాంగ్ లీడర్, ఖైదీ, దొంగ`... ఇలా చిరు టైటిల్స్ తో ఐదు సినిమాలు వచ్చాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ చిత్రానికి `మాస్టర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనకరాజ్ దీనికి దర్శకుడు కావడం విశేషం.