
ట్యాగ్ · 2 కథనాలు

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మాస్ మహారాజా రవితేజ
బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ మూవీస్ పరాజయం పాలయినా ధమాకా మూవీతో రవితేజ తన క్రేజ్, స్టామినా ను నిరూపించుకున్నారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ, పెళ్ళిసందD మూవీ ఫేమ్ శ్రీలీల జంటగా డబుల్ ఇంపాక్ట్ ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా డిసెంబర్ 23 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది.

"ధమాకా" మూవీ లో తన పాత్ర కై డబ్బింగ్ ప్రారంభించిన శ్రీ లీల
మాస్ మహారాజా రవితేజ హీరోగా “ధమాకా !” , “రావణాసుర “, “టైగర్ నాగేశ్వర రావు” మూవీస్ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీస్ తో పాటు రవితేజ , మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న “MEGA 154 ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ "ధమాకా" తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.