
ట్యాగ్ · 2 కథనాలు


భారీ సెట్స్ తో "డెవిల్ "

'డెవిల్' కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్స్
సినిమా రిలీజ్ ల సంగతి పెక్కన పెడితే కళ్యాణ్ రామ్ కూడా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి. మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో పేట్రియాటిక్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఇక సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కళ్యాణ్‌రామ్ ఇది వరకెప్పుడూ చేయని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

భారీ సెట్స్ తో "డెవిల్ "
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం "బింబిసార "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "బింబిసార "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా "డెవిల్ "మూవీ అనౌన్స్అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ , ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మూవీస్ బ్యానర్స్ పై రూపొందే మూవీస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.