
ట్యాగ్ · 2 కథనాలు


జెనీలియా రీ ఎంట్రీ
సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. "నా ఇష్టం "(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు 'కిరీటి' ఎంట్రీ.. ముఖ్య అతిథిగా రాజమౌళి..!
రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్బస్టర్లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్రవారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయగా, కర్ణాటక రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు…