
ట్యాగ్ · 2 కథనాలు


హీరో రామ్ 15 ఇయర్స్ సినీ కెరీర్ పూర్తి

ఏఎన్నార్ 100.. స్పెషల్ స్క్రీనింగ్ మూవీస్ లిస్ట్ ఇదే!
తెలుగు చలనచిత్ర రంగంలోని తొలితరం నటుడు, స్టార్ హీరో, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్). 250కి పైగా చిత్రాలలో నటించిన ఆయన కొన్ని దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఏఎన్నార్ ఇప్పుడు మన మధ్యన లేకపోయినా తాను నటించిన చిత్రాల ద్వారా, కళామతల్లికి ఆయన అందించిన సేవలద్వారా ఎల్లప్పుడూ ప్రజల స్మృతిపథంలో మెదులుతూనే ఉంటారు.

హీరో రామ్ 15 ఇయర్స్ సినీ కెరీర్ పూర్తి
ఎలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ లో వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ పోతినేని , ఇలియానా జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ "దేవదాసు " మూవీ 2006 సంవత్సరంలో జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో రామ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో రామ్ , హీరోయిన్ ఇలియానా "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "రెడీ ", కందిరీగ ", "పండగ చేస్కో ","నేను శైలజ ", హలో గురు ప్రేమ కోసమే " వంటి సూపర్ హిట్ మూవీస్ తో హీరో రామ్ ప్రేక్షకులను అలరించారు.