
ట్యాగ్ · 2 కథనాలు


రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు

'డియర్ మేఘ' రిలీజ్ డేట్ ఫిక్స్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలను కొట్టిపారేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్రయూనిట్. . సెప్టెంబర్ 3న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

రజనీకాంత్ పై మేఘ ఆకాష్ ఆసక్తికర వ్యాఖ్యలు
"లై "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘ ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఛల్ మోహన్ రంగ "మూవీ లో కథానాయికగా నటించిన మేఘ రజనీకాంత్ "పేట " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "శాటిలైట్ శంకర్ " మూవీ తో మేఘ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. మేఘ ప్రస్తుతం 2 తమిళ , 4 తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు. మేఘ కథానాయికగా రూపొందిన "డియర్ మేఘ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "డియర్ మేఘ "మూవీప్రమోషన్‌లో పాల్గొన్నమేఘ అభిమానుల ఆరాధ్య దైవం తలైవా రజనీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.