
ట్యాగ్ · 2 కథనాలు

మొన్న మహేష్ - నేడు తలైవా

"పుష్ప" శ్రీవల్లి సాంగ్ కు క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్
పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్ “ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా” కు డ్యాన్స్ చేసి, ఆ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వార్నర్ బ్రదర్.. తగ్గేదే లే..’ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు.
మొన్న మహేష్ - నేడు తలైవా
క్రికెట్ లో తన ఆటతో ఎలా మెప్పిస్తాడో.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే సందడి చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. మొన్న మహేష్ 'మహర్షి' సినిమాలో సీన్స్ తో అదరగొట్టిన వార్నర్ ఇప్పుడు తలైవాగా మారిపోయాడు. రీ ఫేస్ యాప్ ద్వారా 'మహర్షి' సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న వార్నర్ ఇప్పుడు రజినీ కాంత్ 'దర్బార్' సినిమాలో కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్‌కు బదలు తన ఫేస్‌ను యాడ్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇక ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. చాలా మంచి రిక్వెస్ట్ మేరకు ఇది చేశానని చెబుతూ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలను తెలియజేశాడు.