
ట్యాగ్ · 4 కథనాలు


దాసరిది మరణం కాదు.. అర్ధాంతర అంతర్ధానం

దాసరి బయోపిక్ "దర్శక రత్న"
సక్సెస్ ఫుల్ "తాతా మనవడు" (1972 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దాసరి నారాయణరావు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 50 మూవీస్ కు దర్శకత్వం వహించిన దాసరి పలు మూవీస్ బెస్ట్ ఫిల్మ్స్ అవార్డ్స్ అందుకున్నారు. టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా ఉన్న దాసరిచిత్ర పరిశ్రమకు పలు సేవలు అందించారు. దాసరి వద్ద అసిస్టెంట్స్ గా పనిచేసిన పలువురు దర్శకులుగా మారారు. రైటర్ , యాక్టర్ , డైరెక్టర్ దాసరి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ మూవీ "దర్శకరత్న " తెరకెక్కనుంది.

'దాసరి' కి పద్మ పురస్కారం ఇవ్వాలి.. 'చిరు' విన్నపం
ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎవరంటే దాసరి నారాయణ రావు అని ఎవర్ని అడిగినా చెపుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరుండి సమస్యను పరిష్కారం చేసేవారు. ఇక దాసరి చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరునే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. చిరునే దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై స్పందిస్తున్నారు. పెద్దరికంగా వ్యవహరిస్తున్నారు. ఇక దాసరి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మృసించుకున్నారు చిరు. అంతేకాదు ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

దాసరిది మరణం కాదు.. అర్ధాంతర అంతర్ధానం
ఈరోజు మే 30.... 2017 మే 30 వ తేదీన శతాధిక చిత్ర దర్శక శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అర్ధాంతరంగా అంతర్థానమైపోయిన రోజు.సాధారణంగా తనువు చాలించిన వారిని మరణించారు అని, చనిపోయారు అని, పరమపదించారు అని అంటారు... కానీ దాసరి నిష్క్రమణను అలా అన బుద్ధి కావడం లేదు... ఎందుకంటే ఆయన మరణాన్ని ఊహా మాత్రంగా కూడా ఎవరూ ఊహించలేదు... ఆయన అంత త్వరగా ఈ లోకం విడిచి వెళ్తారని కలలో కూడా అనుకోలేదు.
ఆ సినీ శిఖరం ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ....
ఆయన కీర్తి - ఆచంద్రతారార్కం ఆయన శక్తి - అప్రతిహత పాశుపతాస్త్రం ఆయన ప్రతిభ - బహుముఖ విస్తృత విశ్వరూపం ఆయన లక్ష్యం - సమస్త జన సంక్షేమం ఆయన మనసు - మర్మం ఎరుగని భోలా శంకరం