
ట్యాగ్ · 2 కథనాలు

ఓటీటీలోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇటీవలికాలంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేసాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మరియు నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన 'ఆయ్' సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేశాయి.

ఓటీటీ లోకి కమిటీ కుర్రోళ్ళు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకుందీ చిత్రం.