
ట్యాగ్ · 2 కథనాలు


నా పుట్టిన రోజున తలైవా బ్లెస్సింగ్

రుద్రుడు యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్
ఇండస్ట్రీలోకి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమిళ్, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలా డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుండి పలు సినిమాల్లో కీలక పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా డైరెక్టర్ గా ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపించాడు. దీంతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా లారెన్స్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇక ముని సినిమా తరువాత హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

నా పుట్టిన రోజున తలైవా బ్లెస్సింగ్
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స డాన్సర్గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'మాస్' అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. చిరంజీవి దగ్గర నుండి ఎంతో మందికి పలు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫి అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.