
ట్యాగ్ · 2 కథనాలు


విక్రమ్ "మహాన్ "పై రజనీకాంత్ ప్రశంసలు

తంగలాన్ షూటింగ్ లో గాయపడిన విక్రమ్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటి పార్ట్ గత ఏడాది రిలీజ్ అవ్వగా రెండో పార్ట్ గత నెల ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా కొంత వరకూ పూర్తయింది.

విక్రమ్ "మహాన్ "పై రజనీకాంత్ ప్రశంసలు
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్ , ధృవ్ విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "మహాన్ "తమిళ మూవీ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ వెర్షన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యాయి. మద్యం సిండికేట్ లీడర్ గా విక్రమ్, పోలీస్ అధికారిగా ధృవ్ విక్రమ్ నటించారు. "మహాన్" సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విక్రమ్ , ధృవ్ ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.