
ట్యాగ్ · 2 కథనాలు

వాస్తవ ఘటనల ఆధారంగా చిరు, కొరటాల మూవీ?

మళ్లీ బిజీ అయిన చిరు..!
రీఎంట్రీ తర్వాత చిరు కూడా స్పీడు పెంచిన సంగతి తెలిసిందే కదా. మధ్యలో కరోనా కనుక రాకపోయి ఉంటే ఈ రెండేళ్ల గ్యాప్ లో రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసేసి ఉండేవాడు. కానీ కరోనా వల్ల సినిమాలు పెండింగ్ లో పడిపోయాయి. అందులో భాగంగానే ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న ఆచార్య సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఇక ఈ మధ్యలో చిరు తన కొత్త సినిమాలను కూడా మొదలు పెట్టాడు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్నగాడ్ ఫాదర్ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేసుకోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా జరుపుకున్నాయి.
వాస్తవ ఘటనల ఆధారంగా చిరు, కొరటాల మూవీ?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే పూజ జరుపుకున్న ఈ సినిమా... డిసెంబర్ తొలి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అంతేకాదు... ప్రస్తుతం కోకాపేట్లో ఓ కాలనీ సెట్ వేస్తున్నారని, అక్కడే పాటతో చిత్రీకరణకు శ్రీకారం చుడతారని టాక్.