
ట్యాగ్ · 2 కథనాలు


చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

మెగా మూమెంట్స్
మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే అభిమానుల కేరింతలతో, కొత్త సినిమాల అప్ డేట్స్ తో కోలాహలం గా జరిగింది. రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి . బర్త్ డే సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందే మూవీస్ టైటిల్స్ , పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ "లూసిఫర్ "తెలుగు రీమేక్ మూవీకి "గాడ్ ఫాదర్ "టైటిల్ ని ప్రకటించారు.

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ
సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.