
ట్యాగ్ · 2 కథనాలు


చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!

మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్‌డేట్స్ వరుసపెట్టి ఇస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాల పోస్టర్స్, అప్ డేట్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా కూడా ఉంది. . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ లుక్ తో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆకట్టుకుంటుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాాలా రోజుల తరువాత మళ్లీ చిరును మాస్ లుక్ లో చూస్తున్నాం. మళ్లీ పాత చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది…