
ట్యాగ్ · 2 కథనాలు

కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం

కీడా కోలా- బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా' ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈసినిమాను రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈ చిత్రంలో ఎనిమిది ప్రధాన పాత్రలు ఉన్నాయి. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ కి బ్రహ్మానందం విరాళం
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దయి రోజు వారీ జీతాలపై బ్రతికే పేద కళాకారులు, కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. మెగా స్టార్ చిరంజీవి కొంతమంది సినీప్రముఖులతో డిస్కస్ చేసి కరోనా క్రైసిస్ చారిటీ నెలకొల్పి , తోటి నటీనటుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ ఆదుకుంటున్నారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కరోనా క్రైసిస్ ఛారిటీ కి 3 లక్షలు విరాళాన్ని ఈ రోజు ప్రకటించారు.