
ట్యాగ్ · 2 కథనాలు


తాత జయంతి కి ఎన్టీఆర్ ఎమోషనల్

66వ జయంతి-మిమ్మల్ని స్మరించుకుంటూ
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు హరికృష్ణ. ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణావతారం సినిమాలో బాల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హరికృష్ణ. ఆ తర్వాత బాల నటుడిగానే 'తల్లా? పెళ్లామా', 'తాతమ్మ కల' సినిమాల్లో కనిపించారు. కాస్త పెద్దయిన తరువాత 'రామ్ రహీమ్', 'దాన వీర శూర కర్ణ' సినిమాలో నటించాడు. 'దాన వీర శూర కర్ణ'లో అర్జునుడిగా నటించిన హరికృష్ణ ఆ సినిమా తరువాత దాదాపు చాలా ఏళ్లు సినీ ప్రపంచానికి దూరమయ్యాడు. ఆ తరువాత సీతారామరాజు సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఇక ఆతరువాత సీతయ్య సినిమాతో స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నారు. అలా…

తాత జయంతి కి ఎన్టీఆర్ ఎమోషనల్
నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు మొత్తం ఆ నట సార్వభౌముడిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాత నట వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా తాతను గుర్తుచేసుకున్నాడు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది… మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకి పో తాతా… సదా మీ ప్రేమకు బానిసను… నందమూరి తారకరామారావు” అంటూ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మాత్రం అందరినీ హత్తుకుంటుంది.