
ట్యాగ్ · 2 కథనాలు


కూతురికి యాంకర్ రవి స్పెషల్ బర్త్ డే విషెస్
ప్రస్తుతం యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సందర్భంగా రవి తన ముద్దుల కూతురు వియా కి స్పెషల్ వీడియో ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించాడు. అదేంటి రవి హౌస్ లో ఉండగా వీడియో ఎలా పంపించడబ్బా అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లేముందు కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ లో ఉంచుతారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలోనే క్వారంటైన్ పీరియడ్ లో ఉన్నప్పుడే రవి తన కూతురు వియా కోసం బర్త్ డే విషెస్ అందిస్తూ స్పెషల్ గా వీడియో తీసుకున్నాడు. ఇక ఇప్పుడు వియా పుట్టిన రోజు సందర్భంగా రవి స్పెషల్ వీడియో ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. మరి రవికి…

బిగ్ బాస్ 5 ఫైనల్ లిస్ట్ ఇదేనా..!
బిగ్ బాస్ లవర్స్ సీజన్ 5 కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈసారి అదే రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది . అంతేకాదు ఈసారి బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ లు వీరేనంటూ పులువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సురేఖా వాణి, వర్షిణి, ఈషాచావ్లా ఇలా ఈసారి చాలా మంది తెలిసిన వాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.