
ట్యాగ్ · 4 కథనాలు


"రాధేశ్యామ్ " మూవీ ఫస్ట్ డే షూటింగ్ లో భాగ్యశ్రీ

ప్రభాస్ పై భాగ్యశ్రీ ప్రశంసలు

'ప్రభాస్' కు స్పెషల్ థ్యాంక్స్

ప్రభాస్ గొప్ప స్టార్ - భాగ్యశ్రీ
బ్లాక్ బస్టర్ "మైనే ప్యార్ కియా" హిందీ మూవీ తో భాగ్యశ్రీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి స్టార్ డమ్ పొందారు. ఆ తరవాత పెళ్లి చేసుకుని భాగ్యశ్రీ సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. ఇటీవల "తలైవి" తమిళ మూవీ లో నటించిన భాగ్యశ్రీ.. ఇప్పుడు "రాధే శ్యామ్" మూవీ లో హీరో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు. "రాధేశ్యామ్" మూవీ ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

"రాధేశ్యామ్ " మూవీ ఫస్ట్ డే షూటింగ్ లో భాగ్యశ్రీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రభాస్ పై భాగ్యశ్రీ ప్రశంసలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

'ప్రభాస్' కు స్పెషల్ థ్యాంక్స్
ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రభాస్ ఏ సినిమా చేస్తే ఆ సినిమా టీమ్ కు స్పెషల్ గా వంటలు చేయించుకొని మరీ తీసుకెళుతుంటాడు . ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కూడా చాాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా మరో సీనియర్ హీరోయిన్ తాజాగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు భాగ్యశ్రీ. రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భాగ్యశ్రీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కొద్దిరోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ లో ఉండగా రీసెంట్ గానే మళ్లీ…