
ట్యాగ్ · 2 కథనాలు

అల్లుడు "అదుర్స్ "

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్టైలిష్ లుక్
పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , నస్రత్ భరూచా జంటగా”ఛత్రపతి ” హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ తెలుగు “ఛత్రపతి ” హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించారు. డబ్బింగ్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బెల్లంకొండ ఈ మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
అల్లుడు "అదుర్స్ "
సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి పండగకు "అల్లుడు అదుర్స్ " మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.