
ట్యాగ్ · 2 కథనాలు


సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ టీజర్ రిలీజ్

'బజార్ రౌడి' ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోల సినిమాలంటే చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అయితే కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను కూడా- ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు. కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే.. తన సినిమాల్లో కూడా యాక్షన్ సీన్స్, పాటలు అన్ని ఉంటాయి. అయితే అవి కామెడీగా ఉన్నా అవే ప్రేక్షకులకు నచ్చుతాయి. అందుకే సంపూ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. మొదటి సినిమా 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించాడు.

సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడీ’ టీజర్ రిలీజ్
“హృదయ కాలేయం” అనే ఒక్క మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయి.. ఆ తరువాత పలు అవకాశాలను అందిపుచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హీరో కు కావాల్సిన ఫిజిక్, బాండీ లాంగ్వేజ్ లేకపోయినా కూడా... తన సీరియస్ నటనతోనే అందరినీ కడుపుబ్బా నవ్వించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. హాయిగా నవ్వుకోడానికైనా సంపూ సినిమాకు వెళతారు ప్రేక్షకులు. 'హృదయ కాలేయం' తరువాత ‘సింగం 123’, కొబ్బరిమట్ట సినిమాలు విడుదల చేసిన సంపూ.. ఆతరువాత పలు సినిమాల్లో కమెడియన్, అతిథి పాత్రల్లో కూడా కనిపించారు.