కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bangaru Bullodu Movie

ట్యాగ్ · 4 కథనాలు

రిలీజ్ అప్‌డేట్

'బంగారు బుల్లోడు' రిలీజ్ డేట్ ఫిక్స్

ఇటీవల హీరోగా సరైన హిట్ లేక వెనకపడిపోయిన అల్లరి నరేశ్ తాజాగా ‘బంగారు బుల్లోడు’ సినిమాతో రావడానికి సిద్ధమయ్యారు. గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఆ రోజు కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తుంది. గత కొద్దిరోజులుగా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జనవరి 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలోకి 'బంగారు బుల్లోడు'

గిరి ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బంగారు బుల్లోడు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఎలాంటి అప్ డేట్ ఇవ్వని చిత్రయూనిట్ ఈరోజు ఒక అప్ డేట్ తో ముందుకొచ్చారు. బంగారు బుల్లోడు సినిమా జ‌న‌వ‌రి 2021లో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మైంది. కొద్ది సేప‌టి క్రితం ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు చిత్రయూనిట్. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'బంగారు బుల్లోడు' టీజర్ రిలీజ్..!

ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు డబల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే అల్లరి నరేష్ నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో నరేష్ ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడని మాత్రం అర్ధమవుతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్