
ట్యాగ్ · 2 కథనాలు

అంతర్జాతీయంగా 'బాహుబలి'కి మరో ఘనత

మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొని అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్.
అంతర్జాతీయంగా 'బాహుబలి'కి మరో ఘనత
బాహుబలి సినిమా గురించి అది సాధించిన రికార్డులు, కలెక్షన్ల గురించి సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఘనతకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా ఇది. జక్కన్న అనే పేరును సార్థకం చేసుకుంటూ.. రాజమౌళి చెక్కిన బాహుబలి అనే శిల్పం దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఇప్పటికే ఈ సినిమాకు అనేక రకాలుగా గౌరవం దక్కగా తాజాగా మరొక గౌరవం దక్కింది. అదేమిటంటే సినిమా మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' ను రాయల్ ఆల్బర్ట్ హాల్ నందు ప్రదర్శించనున్నారు.