ట్యాగ్ · 22 కథనాలు · పేజీ 2
కన్ఫామ్.. పవన్ తో రానా
రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
'అయ్యప్పనుమ్ కోశియనుమ్' రీమేక్ .. పవన్ పక్కన సుదీప్..?
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించి తన నటనతో అందర్నీ మెప్పించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుదీప్. కన్నడలో స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. అప్పుడప్పుడు తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూనే వున్నాడు. ఇప్పుడు మరో సినిమాలో కూడా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తుంది.