
ట్యాగ్ · 4 కథనాలు


"అర్జున్ రెడ్డి "పై షాలిని పాండే ఫీలింగ్స్

'బ్రహ్మీ' అర్జున్ రెడ్డి స్పూఫ్

బెస్ట్ కల్ట్ మూవీ?
ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం మారిపోయినప్పటి నుండి ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టమయిపోయింది. ఒక్కోసారి ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా కూడా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది రుజువైంది. రీసెంట్ రిలీజ్ అయిన బేబీ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో చూస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని షాకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

'అర్జున్ రెడ్డి' సెంటిమెంట్.. అదే డేట్ కు 'లైగర్'
సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూటికి 90 శాతం మంది సెంటిమెంట్స్ ను పాటించేవారు ఉన్నారు. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్ ఇలా రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రౌడీ హీరో కూడా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ టర్నింగ్ సినిమా ఏది అంటే అర్జున్ రెడ్డి అని ఎవరైనా చెబుతారు. ఈసినిమా కేవలం విజయ్ దేవరకొండ కు మాత్రమే చాలా మందికి ట్రెండ్ సెట్ ఫిలిం గా నిలిచింది. ఇక ఈసినిమా 2017 ఆగష్ట్ 25న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ కూడా…

"అర్జున్ రెడ్డి "పై షాలిని పాండే ఫీలింగ్స్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన "అర్జున్ రెడ్డి "మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జబల్‌పూర్ సుందరి షాలిని పాండే , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ స్టేటస్ అందుకున్నారు. "అర్జున్ రెడ్డి" సినిమాతో వచ్చిన క్రేజ్ తో షాలినిపాండే పలు మూవీ ఆఫర్స్ అందుకున్నారు. "మహానటి ", "118 " వంటి సూపర్ హిట్ మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. షాలిని ప్రస్తుతం "జయేశ్ భాయ్ జోర్దార్", "మహారాజా "హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

'బ్రహ్మీ' అర్జున్ రెడ్డి స్పూఫ్
తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఇక బ్రహ్మీ చేసిన అర్జున్ రెడ్డి స్పూఫ్ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. మరి ఆ వీడియో మీకోసం చూసి నవ్వుకోండి.