
ట్యాగ్ · 2 కథనాలు


గిబ్బరిష్ గేమ్ పై ఆసక్తి తో అనుపమ

అనుపమ చేతిలో నాలుగు సినిమాలు
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చేతినిండా ఆఫర్ల తో ప్రస్తుతం ఫుల్ బిజీ మోడ్ లో వుంది.రీసెంట్ గా టిల్లు స్క్వేర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈ హీరోయిన్ ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.అందులో మూడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వున్నాయి. అందులో ఒకటి పరదా.సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్న ఈసినిమాలో అనుపమతోపాటు దర్శన రాజేంద్రన్,సంగీత లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

గిబ్బరిష్ గేమ్ పై ఆసక్తి తో అనుపమ
టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం"తళ్ళిపోగాదే " తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.