
ట్యాగ్ · 2 కథనాలు


మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి

పాన్ ఇండియా సినిమాలు తీయను..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీలో చూసినా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు పెద్ద హీరోల నుండి సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లోనే చేయడానికే మేకర్స్ కూడా ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాను మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయలేనంటున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి.

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి
పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్", "F 2":ఫన్ & ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు "వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్"F 2":ఫన్ & ఫ్రస్టేషన్" మూవీ సీక్వెల్ "F 3 "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.