
ట్యాగ్ · 3 కథనాలు

ఓటీటీ లోకి వచ్చేసిన కొరమీను సినిమా
శ్రీపతి కర్రి దర్శకత్వంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కొరమీను. ఈసినిమా ఇటీవలే రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మత్స్యకారుల జీవనవిధానం.. అదే సమయంలో అమాయకులను అంగబలం, ఆర్థికబలంతో భయపెడుతూ శాషించే పెద్దోళ్ల అఘాయిత్యాలను కూడా ఈసినిమాలో చూపించారు మేకర్స్. ఇక ఈసినిమా కూడా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈసినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

కొరమీను మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఒక సహజమైన కథను చూడాలంటే కొరమీను సినిమాను చూసి ఎంజాయ్ చెయొచ్చు. ఈసినిమా అన్ని వర్గాల వారు చూసే సినిమా అని చెప్పొచ్చు.

కొరమీను ట్రైలర్ రిలీజ్
ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద విజయాలు అందుకుంటున్నాయి. అందుకే మేకర్స్ నూతన దర్శకులను, కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఇక ఇప్పుడు అలాంటి నేపథ్యంలోనే వస్తున్న సినిమా కొరమీను. శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆనంద్ రవి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్…