
ట్యాగ్ · 2 కథనాలు

'అల్లు స్టూడియోస్' కు శ్రీకారం

అల్లు స్టూడియోస్ పుష్ప:ది రూల్ మూవీ తో ప్రారంభం ?
చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ తరలి వచ్చిన తరువాత హైదరాబాద్ లో పలు స్టూడియోలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ కి చెందిన అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియో, రామానాయుడు సినీ విలేజ్ (నానక్ రామ్ గూడా) సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి చెందిన పద్మాలయా స్టూడియో, ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన రామకృష్ణా హార్టికల్చరల్ స్టూడియో (నాచారం) లు ఉన్నాయి. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో , రామానాయుడు స్టూడియో రన్ అవుతూ సినిమా షూటింగ్ లతో కళ కళలాడుతున్నాయి.
'అల్లు స్టూడియోస్' కు శ్రీకారం
తెలుగు సినీ చరిత్రలో కామెడీకి కొత్త అర్ధం చెప్పి... తన హావ భావాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రేడు అల్లు రామలింగయ్య. కేవలం కామెడీ పాత్రలు మాత్రమే కాదు విలన్ పక్కన వుండే కామెడీ విలన్ పాత్రల్లో కూడా తన కామెడీతో నవ్వించేవారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా సరే నవ్వులు పూయించి అలరించేవారు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో అల్లు అభినయం జనానికి కితకితలు పెట్టింది. ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీ ఇంత స్థాయిలోఉండటానికి ఒకరకంగా అల్లు రామలింగయ్యే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి.