
ట్యాగ్ · 3 కథనాలు


బాలీవుడ్ దర్శకుడితో అల్లు అర్జున్ సమావేశం

జాయ్ ఫుల్ మూడ్ లో అల్లు అర్జున్

'పుష్ప' క్రేజ్.. 10 మంది 'పుష్పరాజ్' లు ఒకేసారి..!
ఇప్పట్లో ఒక సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టడమంటే మాములు విషయం కాదు. ఒక వేళ హిట్ అయినా కూడా ఆసినిమా గురించి కొద్ది రోజులు మాట్లాడుకొని తరువాత మర్చిపోతారు. కానీ పుష్ప మేనియా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ ఓ సంచలనమే. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాట హుక్…

బాలీవుడ్ దర్శకుడితో అల్లు అర్జున్ సమావేశం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా తెరకెక్కిన "పుష్ప:ది రైజ్ "మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ మూవీ కి విశేష ప్రేక్షకాదరణ లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు "పుష్ప:ది రైజ్ "మూవీ కి బ్రహ్మరథం పట్టారు. అల్లు అర్జున్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో అల్లు అర్జున్ ముంబై లో సమావేశం అవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుందనే అభిప్రాయం ఏర్పడింది.

జాయ్ ఫుల్ మూడ్ లో అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 300కోట్లు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా “పుష్ప: ది రైజ్” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.