
ట్యాగ్ · 2 కథనాలు

అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?

"బుట్టబొమ్మ " సాంగ్ గురించి పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 9 సంవత్సరాల తరువాత కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే , స్టార్ హీరో విజయ్ కు జోడీగా “బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేశారు.స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా మరోసారి ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 2 భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తరువాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్" మూవీ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "ఐకాన్ "మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ని సంప్రదిస్తున్నట్టు సమాచారం.