ట్యాగ్ · 2 కథనాలు
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
కథా చర్చలలో "ఐకాన్ "
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 2 భాగాలుగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ లో నటిస్తున్న విషయంతెలిసిందే . రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ "పుష్ప - ది రైజ్ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "పుష్ప - ది రైజ్ "మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , పుష్ప రాజ్ పరిచయ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
'ఐకాన్' సాలిడ్ లుక్ లో బన్నీ..!
ఈమధ్య సినిమాల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ కూడా సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకూ కథలోనే కాదు తమ లుక్ విషయంలో కూడా సినిమా సినిమాకు డిఫరెన్స్ చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఫార్ములాను అల్లు అర్జున్ కూడా ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలోనే తన డీగ్లామర్ లుక్ లోకి మారిపోయి కొత్తగా ట్రై చేస్తున్నాడు. పుష్ప లుక్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రాబోయే సినిమా ఐకాన్ కోసం కూడా సాలిడ్ లుక్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.