
ట్యాగ్ · 2 కథనాలు

అల్లు అర్జున్ తో నటించాలని ఉంది - అలియా భట్

'ఆర్ఆర్ఆర్' పై అలక.. అలియా క్లారిటీ..!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా.. ఎన్టీఆర్.. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమా ఈ నెల 25న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు పదివేల స్క్రీన్లలో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 500కోట్లకు పైగా వసూలు చేసింది.
అల్లు అర్జున్ తో నటించాలని ఉంది - అలియా భట్
సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ "(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ "హైవే ", "2 స్టేట్స్", "హంప్టీ శర్మ కి దుల్హనియా" , "షాందార్ ", "కపూర్&సన్స్ ", "ఉడ్తా పంజాబ్ ", "డియర్ జిందగీ" , "బద్రీనాథ్ కి దుల్హనియా ", "రాజి ", "గల్లీ బాయ్ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అలియా భట్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "గంగు భాయ్ కతియావాడి" ఫిబ్రవరీ 5 వ తేదీ రిలీజ్ కానుంది. "బ్రహ్మాస్త్ర " , "డార్లింగ్స్ ", "రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీస్ లో అలియా నటిస్తున్నారు.