
ట్యాగ్ · 2 కథనాలు

హీరో నాని బర్త్ డే సందర్భంగా సూపర్ హిట్ అలా .. మొదలైంది మూవీ రీ రిలీజ్
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని ప్రస్తుతం #NANI 30 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ నిర్మాతల నుండి 'నాని' కి స్పెషల్ బర్త్ డే విషెస్..!
అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ఆరంభించి.. అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో తన మార్క్ ను చూపించి ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్పెషల్ పేజీని ఏర్పాటుచేసుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు పొందిన నాని.. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎక్కువ శాతం సక్సెస్ రేటునే సొంతం చేసుకున్న నాని... ఫ్లాప్స్ వచ్చినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా తనపని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నేడు నాని తన పుట్టినరోజు జరుపుకుంటుండగా తన సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చేశాయి. అలానే నానికి…