
సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు


ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "RX 100 " మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం "మూవీ రూపొందనుంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ మూవీ లో హీరో శర్వానంద్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉంటుందని, కథానాయికగా ఐశ్వర్య రాజేష్ ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్ ప్రస్తుతం రైతు సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న "శ్రీకారం " మూవీ లో నటిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి.