
ట్యాగ్ · 3 కథనాలు


'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్

"మేజర్ "మూవీ రిలీజ్ డేట్
సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో “మేజర్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. "మేజర్ "మూవీకి హీరో అడివి శేష్ కథ ను అందించడం విశేషం.

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్
క్షణం, గూఢచారి, ఎవరు చిత్రాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా వల్ల ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే రీసెంట్ గా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ పూర్తవ్వనుంది. దీంతో సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దాని కోసం మంచి డేట్ ను చూస్తున్నారట మేకర్స్.