
ట్యాగ్ · 2 కథనాలు


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో 'మేజర్' టీమ్

"మేజర్"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో 'మేజర్' టీమ్
ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ 'మేజర్' సినిమా కూడా ఒకటి. 26/11 హీరో ఎన్ఎస్జీ కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న 'మేజర్'లో మేజర్ సందీప్ బాల్యం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈసినిమాలో చూపించబోతున్నారు.