ట్యాగ్ · 4 కథనాలు
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ

సమంత లక్ 'ఎవరు' కి కలిసొస్తుందా..?
కంటిన్యూస్ గా 18గంటలు మేజర్ షూట్
గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టే చెపుతున్నాడు అడివిశేష్. సినిమా కోసం కంటిన్యూస్ గా 18 గంటలపాటు షూటింగ్ చేశామని.. టీం ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపాడు.
అడివి శేష్ 'మేజర్' లో 'దబాంగ్ 3' బ్యూటీ
ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ ఘటనల ఆధారంగా.. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శేష్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సగం పైగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
"గూఢచారి " మూవీ టీమ్ , అభిమానులకు థ్యాంక్స్ -అడివి శేష్
అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గూఢచారి " మూవీ 2018 సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శోభిత ధూళిపాళ , మధుశాలిని , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ "గూఢచారి " మూవీ కి సీక్వెల్ "గూఢచారి 2" మూవీ రూపొందనుంది.

సమంత లక్ 'ఎవరు' కి కలిసొస్తుందా..?
'గూఢచారి' లాంటి యాక్షన్ డ్రామాతో హిట్ కొట్టిన అడివి శేష్ ఇప్పుడు ఎవరు అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో థ్రిల్ చేయడానికి వస్తున్నాడు. ఇక ఈసినిమాను ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేసే నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ రిలీజ్ కార్యక్రమంలో అడివి శేష్ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు.