
ట్యాగ్ · 3 కథనాలు


'అద్భుతం' ట్రైలర్ రిలీజ్

తేజ 'అద్భుతం' ఇంప్రెసివ్ గా ఉంది
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా అద్భుతం. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోరిలీజ్ అయింది ఈసినిమా. ఇక కాస్త విభిన్నమైన కథతో ఈసినిమా తెరకెక్కడంతో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా చూసిన మెగాస్టారి చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. ఈనేపథ్యంలో చిరు తన ట్విట్టర్ ద్వారా హాట్ స్టార్ లో అద్భుతం సినిమా చూశానని.. ఇదొక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా అని.. యంగ్ నటులు తేజ సజ్జ, శివానీ ల పెర్ఫామెన్స్ లు ఇంప్రెసివ్ గా ఉన్నాయని.. అంతే కాకుండా ఈసినిమాకోసం…

'అద్భుతం' ట్రైలర్ రిలీజ్
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, శివాని హీరో, హీరోయిన్లుగా అద్భుతం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ అవ్వగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందన్న విషయం అర్ధమయింది. అయితే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

తేజ -శివాని మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయమవుతూ... తేజ సజ్జా, రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ హీరో, హీరోయిన్లుగా కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైన ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడగా మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఇదిలా ఉండగా నేడు శివాని పుట్టినరోజు కావడంతో.. ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేయగా.. తేజ – శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. పోస్టర్ కూడా టైటిల్ కు తగ్గట్టే ఆకట్టుకుంటుంది.